24-03-2025 12:00:00 AM
కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జి నర్సింగరావు
జగిత్యాల, మార్చి 23 (విజయక్రాంతి): పలు అనారోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోరుట్ల పట్టణ, మండలానికి చెందిన రూ. 11 లక్షల 54 వేల 5 వందల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డితో కలిసి ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే అనారోగ్య సమస్య వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని నర్సింగరావు అన్నారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఎలేటి మహిపాల్ రెడ్డి, నాయకులు అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, ఎంబేరి నాగభూషణం, చిటిమెల్లి రంజిత్ గుప్తా, ఎలిశెట్టి భూమారెడ్డి, జిందమ్ లక్ష్మీనారాయణ, సురేష్ గౌడ్, నరేష్, రాజు పాల్గొన్నారు.