17-03-2025 02:02:41 AM
దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్
నల్లగొండ, మార్చి 16 (విజయక్రాంతి) : సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం 173 మంది లబ్ధిదారులకు రూ. 30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు.
అనారోగ్యంతో కార్పొరేట్స్థాయి వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి నుంచి సర్కారు ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు. అనంతరం కొండమల్లేపల్లి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారాక్ చెక్కులు పంపిణీ చేసి వివిధ కాలనీల్లో రూ.90 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జానిగానితండాలో పంచాయతీ భవనాన్నిఒ ప్రారంభించారు. కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ వేణూధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.