రూ. 9 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, ముషీరాబాద్, రాంనగర్ డివిజన్లకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 11 చెక్కులు సీఎంఆర్ 2 ఎల్ఓసి (9 లక్షల) విలువ గల చెక్కులను లబ్ధిదారులకు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేదలు వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తులు చేసుకుంటే తన వంతు సహాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు, వల్లాల శ్యామ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, వల్లాల రవి యాదవ్, కరిక కిరణ్ కుమార్, శివ ముదిరాజ్, శ్రీధర్ చారి, కళ్యాణ్ నాయక్, బింగి సతీష్, రామచందర్, రాములు, టిల్లు తదితరులు పాల్గొన్నారు.