calender_icon.png 15 April, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్

13-04-2025 04:56:25 PM

పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని రతన్ సింగ్ తాండాకు చెందిన రాహుల్ కు ఆదివారం రూ, 45000/-ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్ ను కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు చిప్ప మోహన్ అందజేశారు. ఈ సందర్భంగా చిప్ప మోహన్ మాట్లాడుతూ... వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు పెన్నిధి లాంటిదని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కుల అందించడం వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.