కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకుపల్లి వెంకన్న
మునుగోడు (విజయక్రాంతి): నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకుపల్లి వెంకన్న అన్నారు. ఆనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన చెక్కును మంగళవారం పంపిణీ చేశారు. పలివెల గ్రామానికి చెందిన భీమనపల్లి నరసింహ 15000 చెక్కున ఆయన అంద చేసి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారని ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తున్నారని త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాస రాజు యాదగిరి,మాజీ ఎంపీటీసీ చెరుకు కృష్ణయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనగంటి కృష్ణ, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి గోసుకొండ కృష్ణయ్య, గోసు కొండ ముత్తయ్య, గోసు కొండ కృష్ణయ్య, పూల శ్రీనివాసు, బాసరాజు యాదయ్య, గోసుకొండ మారయ్య, పంతంగి సత్తయ్య, గోసుకొండ నరసింహ, గోసుకొండ, మారయ్య పాల్గొన్నారు.