11-03-2025 12:30:27 AM
కుత్బుల్లాపూర్, మార్చి 10 (విజయక్రాంతి):కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ఆదేశాల మేరకు నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, పలు డివిజన్ల అధ్యక్షులు, హాజరై 21 లక్షల 46 వేల రూపాయల విలువగల 57 సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదల్లో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఆర్థిక భద్రతను ఇస్తుందన్నారు. ఆర్థికంగా సతమతమైతున్న నిరుపేదలకు కాస్త ఉపశమనం కల్పించేందుకు సీఎం సహాయనిది చెక్కులను నేడు లబ్ధిదారులకు అందజేశామన్నారు. రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి అందే విధంగా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, మహమ్మద్ రఫీ, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, రుద్ర అశోక్, అర్వ శంకరయ్య, పోలే శ్రీకాంత్, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, గుబ్బల లక్ష్మీనారాయణ, సంపత్ గౌడ్, తెలంగాణ సాయి, యేసు, సుధాకర్, నదీమ్ రాయ్, దుర్గా రావు, మహిళ నాయకురాలు సంధ్య, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.