10-03-2025 07:10:49 PM
బైంసా (విజయక్రాంతి): భైంసాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బాధితులకు 4 లక్షల 50 వేల విలువ గల సీఎం రిలీజ్ ఫండ్ చెక్కులను ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణరావు పటేల్ అందజేశారు. ఈ కార్యాక్రమంలో పార్టీ నాయకులు శంకర్ చేంధ్రే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి, మాజీ ఎంపీపీ రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.