20-03-2025 04:32:09 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన భద్రాచలం పట్టణానికి చెందిన పలువురు బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వ అనుమతితో వారికి చెక్కులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా చర్ల మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన లంక నాగేశ్వరరావు రూ. 60,000 చెక్కును అందుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.