15-04-2025 12:57:18 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): నెన్నల మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన గౌతూరు బాపూరావు కు మంగళవారం మంజూరైన రూ 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund Cheque ) చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గట్టు మల్లేష్, నాయకులు భూమ్మీద హరీష్ గౌడ్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు కూడా మద్దతుగా నిలవాలని కోరారు.