10-04-2025 12:59:54 PM
అనంతగిరి: కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి(Kodad MLA Padmavathi Reddy) ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రెడ్డిమల్ల చంద్రయ్యకి 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుని అనంతగిరి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి(Anantagiri Congress Mandal Party President Musuku Srinivas Reddy) అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముసుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డేగ కొండయ్య కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతకుంట్ల సూర్య పాల్గొన్నారు