25-03-2025 03:36:18 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని 28వ వార్డు హనుమాన్ బస్తికి చెందిన లింగాల హాసిని అనే నాలుగేళ్ల చిన్నారి పాఠశాలలో మెట్ల పై నుండి కింద పడి చేయి విరగడంతో మంచిర్యాలలోని టచ్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. ఈ విషయం ఏకదంతా మిత్రమండలి సభ్యులు బొంతల శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వినోద్ రూ 16 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంజూరు చేయించారు.చిన్నారి తల్లిదండ్రులు లింగాల శారద, మోహన్ లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. తమ పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం జరిగేలా చూసిన నాయకులు నాతరి స్వామి, ఏకదంత మిత్రమండలి సభ్యులు బొంతల శ్రీనివాస్ లకు చిన్నారి హాసిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.