04-04-2025 01:26:52 AM
హుజూర్‌నగర్, ఏప్రిల్ 3: హుజూర్‌నగర్ పట్టణంలోని 25వ వార్డ్ సీతారాంనగర్ కు చెందిన తెల్లబోయిన వెంకన్న గత ఆరు నెలల క్రితం గుండెకు సంబంధించిన సర్జరీ చేయించూకోవడం జరిగింది. దానికి సంబంధించిన 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు కావడం తో ఈరోజు చెక్కు పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి,25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సులువ చంద్రశేఖర్ చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేయడం జరిగింది.
సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వము లాగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన చెక్కులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి ఎప్పటికప్పుడు సామాన్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తున్నారని అందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గుబాటి రమేష్, పగిడి నాగేంద్ర బాబు, తెల్లబోయిన కోటేష్ తదితరులు పాల్గొన్నారు.