calender_icon.png 23 March, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధిని చెక్కు పంపిణీ

22-03-2025 06:43:00 PM

నాగారం: సీఎం సహాయనిధిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు జాజుల వీరయ్య అన్నారు. మండల కేంద్రంలో నాగారంబంగ్లా గ్రామానికి చెందిన తొడుసు నాగమల్లు కుమారుడు మణికర్‌ ఇటివల అనారోగ్యగానికి గురికావడంతో ఆయనకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహాకారంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.60,000ల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును పంపిణీ చేశారు. పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కన్నెబోయిన రాంమూర్తి, కొనిరెడ్డి మోహన్‌రెడ్డి, బయ్యం వెంకన్న, మంగదుడ్ల దశరథ, కొలిపాక సాయి కన్నెబోయిన నాగరాజు కన్నెబోయిన అంజయ్య, నరేందర్‌రెడ్డి  కొనిరెడ్డి లింగారెడ్డి, సంజీవరెడ్డి మమేష్‌ తదితరులు పాల్గొన్నారు.