calender_icon.png 22 April, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి

22-04-2025 04:27:09 PM

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి...

చిట్యాల (విజయక్రాంతి): అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం సహాయనిధి సహాయపడుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి(Congress Mandal President Gootla Tirupati) అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన తెల్లకుంట సమ్మయ్యకు మంజూరైన సీఎం సహాయనిది రూ.28వేల చెక్కును ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాంబలక్ష్మి భద్రయ్య, మండల ఉపాధ్యక్షుడు భగవాన్, ఒడితల గ్రామశాఖ అధ్యక్షుడు బసాని రమేష్, సీనియర్ నాయకులు పట్టెం శంకర్, పసునూటీ రాజు, యూత్ నాయకులు కిరణ్, మొండయ్య, గట్టు రాజు, కిష్టమూర్తి, శంకర్రావు, అంకుశావళి, జగపతి, మహిళా నాయకురాలు సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.