calender_icon.png 22 February, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ

22-02-2025 01:38:51 AM

కరీంనగర్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఇటీవల రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యలు వివరించగా, సానుకూలంగా స్పందించిన సీఎం ప్రతి సమస్యను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ర్ట అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. శుక్రవారం నగరంలోని టీఎన్జీవో భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎన్టీవో సంఘం 80వ సంవత్సర వేడుకలను హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, నాయకులు నాగుల నరసింహ స్వామి, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్సింగ్, మడిపెల్లి కాళీచరణ్, అరవింద్ రెడ్డి, ఎంఏ హమీద్, బొంకూరి శంకర్, నాగేందర్, అమరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, మారుపాక రాజేష్ భరద్వాజ్, సుమంత్ రావు, పోలు కిషన్, ప్రసాద్ రెడ్డి, కోట రామస్వామి, శంకర్, సునీత, సబిత, కొండయ్య, నగేశ్, తదితరులు పాల్గొన్నారు.