02-03-2025 12:25:44 AM
ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 113 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎక్స్‌గ్రేషియా చెల్లిం పు కోసం, నిధుల విడుదలకు ఆర్థిక శాఖ కార్యదర్శి రామక్రిష్ణా రావును సీఎం ఆదేశించినట్లు తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్బంగా.. గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసికెళ్లగా వెంటనే స్పందించి నిధుల విడుదలకు ఆదేశాలిచ్చినట్లు అనిల్ తెలిపారు.