24-04-2025 03:15:47 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): జమ్ము కశ్మీర్ పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పలువురు మంత్రివర్గ సహచరులతో నిర్వహించిన సమావేశం ఉగ్రవాదుల దాడులో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్,పలువురు ఎంపీలతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ దేశ పర్యటన ముగించుకొని నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి రూ.12,062 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పలు రంగాల్లో సహకారం, సాంకేతిక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపింది.