calender_icon.png 30 October, 2024 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లతో 2న సీఎం భేటీ

30-07-2024 01:25:18 AM

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నట్టు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీస్టేడియంలో నిర్వహించే సమావేశంపై సోమవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంత పెద్దసంఖ్యలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారని, ఈ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయలతో నేరుగా సీఎం మాట్లాడేందుకు సమావేశం నిర్వహించనున్నట్టు వివరించా రు. ఎల్బీస్టేడియంలో దాదాపు 30 వేల మందికి రేన్ ప్రూఫ్ టెంటు సౌకర్యం కల్పించాలని, వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు తగు పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో కావా ల్సిన మంచినీరు, పారిశుద్ధ్యం సౌకర్యాలు కల్పించాలని సూచించారు.