రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై చర్చ
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, భూమిలేని పేదలకు అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుతోపాటు రాష్ట్రంలో అమలవుతున్న అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం భావిస్తు న్నారు. ఈ క్రమంలో జిల్లాల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది.