- ఉపాధ్యాయులతో సమావేశం
- పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
- విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30(విజయక్రాంతి): నగరంలోని ఎల్బీ స్టేడియం లో ఆగస్టు 2న నిర్వహించబోయే సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో నిర్వహించబోయే సభకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆయన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధి కారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సభ జరుగుతుందన్నారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులను నిజాం కాలేజీ, ఎన్టీఆర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో పార్కింగ్ చేసేలా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, ఎస్సీ , ఎస్టీ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శులు ఎన్ శ్రీధర్, ఏ శరత్, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ సెక్రటరీ ఎస్ హరీశ్, అయేషా మసరత్‌ఖానం, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఎండీ సోనిబాలాదేవి, ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.