25-02-2025 05:58:18 PM
నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రావులపల్లి జగదీశ్వర్, కార్యదర్శి కమల్ ఇనాని...
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సానుకూలంగా స్పందించారని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Chamber of Commerce) అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్, కార్యదర్శి కమల్ ఇనాని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్‌లో పర్యటించిన సందర్భంగా కలిసి నిజామాబాదు వ్యాపారుల సమస్యలపై మెమోరాండం సమర్పించామని పేర్కొన్నారు. జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో పాటు డ్రై పోర్ట్ మంజూరు చేయాలని, వ్యాపారస్తులను ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో అధికారులు వేధించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.