calender_icon.png 27 November, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం

27-11-2024 03:18:33 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా దేశ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ బీఆర్‌ఎస్ పాలనలో 1.61లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.

సీఎం చెబుతున్నట్లు 50 వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేష న్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ధృవపత్రాలు పరిశీలన కేసీఆర్ ప్రభుత్వం చేసిందనే సంగతి మరిచిపోయారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా మాట తప్పిందని పేర్కొన్నారు. హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు పక్కదారి రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.  

ప్రశ్నిస్తే కేసులు, మీడియాపై ఆంక్షలు  

రేవంత్‌రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే కేసులు, ప్రజాప్రతినిధుల అరెస్టు, మీడియాపై ఆంక్ష లు పెడుతున్నారని విమర్శించారు. వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో చనిపోయిన శైలజ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేం దుకు వెళ్తుతున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మిని అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీడియాను సైతం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం మీడియా స్వేచ్చను హరించడమేనన్నారు.

గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటీకీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోద న్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నామని కానీ రాజ్యాంగ సూత్రాలను ప్రభుత్వం అడుగడునా తుంగలో తొక్కుతుందని ఆయన విమర్శించారు.