24-03-2025 01:22:47 AM
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్స వాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవస్థాన అర్చకులు, అధికారులు ఆహ్వానించారు.
ఆదివారం సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి తుమ్మలను హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలిసి ఆహ్వానపత్రాలు అందజే శారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రు లు ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ అభివృద్ధికి అవసరమైన భూ సేక రణ, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సీఎం, మంత్రులను కలిసిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదా య శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు ఉన్నారు.