విగ్రహ రూపురేఖలు బయటకు రానీయొద్దని ఆదేశం!
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 29: తెలంగాణ తల్లి విగ్రహ తయారీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తయారు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌తో కలిసి శుక్రవారం సీఎం పరిశీలించారు. విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పి శంకర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా విగ్రహం ప్రతిష్ఠించే వరకు విగ్రహ రూపురేఖలు కానీ చిత్రాలు కానీ బయటకు తెలియనీయొద్దని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తొలి ప్రకటన వెలువడిన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిం దే. అదే తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్‌లో ఆవిష్కరిం చడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రక టించింది. ఇదిలా ఉండగా విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ప్రాం తంలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు.