calender_icon.png 29 November, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమృత్ టెండర్లతో సీఎంకు సంబంధం లేదు

25-09-2024 01:56:47 AM

మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): అమృత్ టెండర్లపై అనవసరంగా వివాదం చేస్తున్నారని, సూదిని సృజన్‌రెడ్డి తన చిన్న అల్లుడేనని.. సీఎం రేవంత్‌రెడ్డికి బామ్మర్ది కాదని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడు తూ.. సృజన్‌రెడ్డి మనోహర్‌రెడ్డి కుమారుడేనని, ఆయనకు రాజకీయాలతో సంబంధా లు లేవని చెప్పారు.

10 సంవత్సరాల నుంచి బీఆర్‌ఎస్‌లో లబ్ధిపొందినవారు చాలామంది ఉన్నారని.. వ్యాపారం, రాజకీయం వేర్వేరుగా చూడాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డికి అమృత్ టెండర్లతో ఎలాంటి లింక్ లేదని, తమ కుటుంబాన్ని ఈ కుంభకోణంలోకి లాగొద్దని అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పడు సమాచారంతో మాట్లాడారని, తాను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు.

తాను రాజకీయాల్లో చురుకుగా ఉన్నానని, రెండు రోజులుగా నియోజకవర్గంలో పర్యటన చేసినట్టు తెలిపారు. అనంతరం సృజన్‌రెడ్డి తండ్రి మనో హర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ టెండర్ల ద్వారా నిబంధనల ప్రకారమే తన కుమారుడు టెండర్ దక్కించుకున్నారని, అవసర మైతే వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.