calender_icon.png 21 February, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్టకేలకు సోయా కొనుగోలుకు సీఎం ఆదేశాలు

21-02-2025 12:00:00 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఎట్టకేలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ విండో సొసైటీ వద్ద నిలువ ఉన్న ఎనిమిది వేల క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం తెలిపారు.

45 రోజులుగా సోయా రైతుల పడి గాపులు అని శీర్షికతో ఈనెల 13న విజయ క్రాంతి దినపత్రికలో వచ్చిన కథనం మేరకు సోయా రైతుల సమస్య కు పరిష్కారం దొరికినట్లు రైతులు తెలిపారు. గత 50 రోజులుగా సోయా కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రం వద్ద నిలువ లు పెట్టుకొని కొనుగోలు కోసం రైతులు ఎదురుచూసిన అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు.

రైతులు నెల రోజులుగా పడరాని పాట్లు పడ్డ అనంతరం 161 వ జాతీయ రహదారిపై మదునూరులో రైతులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ నిజాంబాద్ మార్క్ పెడ్ జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డి సైతం వచ్చి రైతులకు హామీ ఇచ్చారు తప్ప కొనుగోలు మాత్రం చేపట్ట లేకపోయారు.

విజయ క్రాంతి దినపత్రికలో రైతుల గోష పడిగాపులు అనే శీర్షికతో ఇచ్చిన కథనాలకు స్పందించి మాజీ ఎంపీ బీబీ పాటిల్ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అయినా కూడా కొనుగోలు చేపట్టలేకపోయారు. స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను కలిసి సోయా రైతులు తమ సమస్యలను వివరించారు.

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర మార్కె పేడ్ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి సోయా రైతుల సమస్యలు తీసుకెళ్లి వివరించారు. 8000 క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోలు చేపట్టాలని కోరిన ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోయా రైతుల పరిస్థితిని వివరించారు.

వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్నూర్ సహకార సంఘ కొనుగోలు కేంద్రంలో ఉన్న 8000 క్వింటాల సోయాబీన్ కొనుగోలు చేపట్టాలని వెంటనే అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా  సోయ రైతుల సమస్య ను సీఎం దృష్టికి తీసుకు వెళ్ళగానే వెంటనే స్పందించి కొనుగోలు చేపట్టాలని ఆదేశించడం పట్ల జుక్కల్ నియోజకవర్గం రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక రైతులు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మాజీ ఎంపీపీ మిలాన్ నాయకులు రామ్ పటేల్ హనుమాన్లు స్వామి బసవంతరావు పటేల్ సోమవార్ మహేష్ కొండవార్ రాజు బండి గోపి ఈదన్న తదితరులు పాల్గొన్నారు.