calender_icon.png 5 November, 2024 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైద్యంపై సీఎంకు పట్టింపు లేదు

01-07-2024 12:05:00 AM

  • మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ 

హనుమకొండ, జూన్ 30 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ వైద్యంపై పట్టింపు లేదని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. హనుమకొండ లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మాత్రమే సీఎం వరంగల్ వచ్చినట్లు కనిపించిందన్నారు. ప్రభుత్వ దవాఖానను కేవలం ఐదు నిమిషాల పాటు పరిశీలించి, అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించడంతోనే పర్యటనను సరిపెట్టుకున్నారన్నారు. అజంజాహీ మిల్లును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసేస్తే, టీడీపీ ప్రభుత్వం మిల్లులోని యంత్రాలను సైతం అమ్మిందని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. టెక్స్‌టైల్ పార్క్ కోసం కేసీఆర్ ప్రభుత్వం 1,300 ఎ కరాల భూమిసేకరించిందన్నారు. 2022లో కేంద్రం పార్క్ పనులకు పీఎం మిత్ర పథకం ద్వారా రూ.500 కోట్లు  ఇస్తామని ప్రకటించిందన్నారు. కేసీఆర్ ప్రభు త్వ హయాంలోనే ఆ నిధులు విడుదలయ్యాయన్నారు. టెక్స్‌టైల్ పార్క్ ఉద్యోగాల్లో స్థాని కులు, వారి పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకే సీఎం వరంగల్‌కు వచ్చారని ధ్వజమె త్తారు. సీఎం పర్యటనతో వరంగల్‌కు ఒరిగిందేమిలేదన్నారు.