స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి బీసీల బద్ద్ధవిరోధి అని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆరోపించారు. లష్కర గూడ సభతో ఈ విషయం మరోసారి బయటపడిందని అన్నారు. ఆయన మాట్లాడు తూ.. గౌడన్నను చెట్టుపై నిలబట్టి, కింద కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని కల్లుగీత వృత్తిని ఎగతాళి చేసేలా వ్యవహరించారని విమర్శించారు. ఇది దొరతనానికి నిదర్శనమన్నారు. నామినేటెడ్ పో స్టుల్లో గౌడ్స్‌కు సీఎం రేవంత్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.