calender_icon.png 23 January, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7న సీఎం కప్ ప్రారంభం

03-12-2024 12:07:34 AM

  1. జనవరి 2న ముగియనున్న పోటీలు
  2. పారా క్రీడాకారులకూ అవకాశం 
  3. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు 8వ తేదీ ఆఖరు 
  4. ఏడు జిల్లాల్లో రాష్ట్రస్థాయి గేమ్స్ 

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహించనున్న సీఎం కప్-2024పోటీలు 7వ తేదీన ప్రారంభమై జనవరి 2న ముగియనున్నాయి.

మొత్తం 36 అంశాల్లో పోటీలను నిర్వహించనున్న రాష్ర్ట క్రీడా ప్రాధికార సంస్థ అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 8వ తేదీలోగా cmcup2024.telangana.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంస్థ సూచించింది.

కాగా నాలుగు దశల్లో (గ్రామ, మండల/మున్సిపల్, జిల్లా, రాష్ర్టస్థాయి) సీఎం కప్ -2024  క్రీడలు జరగనున్నాయి. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి. ఈ ఏడాది పారా క్రీడాకారులను కూడా ప్రభుత్వం ఈ పోటీల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.

షెడ్యూల్ ఇదే.. 

* ఈ నెల 7,8 తేదీల్లో గ్రామ పంచాయితీస్థాయి 

* 10 నుంచి 12 వరకు మండల/మున్సిపల్‌స్థాయి

*16 నుంచి 21 వరకు జిల్లాస్థాయి

27 నుంచి జనవరి 2వ తేదీ వరకు రాష్ర్టస్థాయి పోటీలు

అన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయస్థాయి క్రీడా ప్రమాణాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే రాష్ర్టస్థాయి క్రీడా పోటీలను ఏడు చోట్ల (హైదరాబాద్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ర్ట క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రస్థాయి పోటీలు, వేదికలు ఇవే.. 

హైదరాబాద్: బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నీస్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, సైక్లింగ్, రోయింగ్, స్కాష్, పవర్ లిఫ్టింగ్, స్నూకర్స్, చెస్, కరాటే, టెన్నీస్, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్, యోగా, తైక్వాండో, బేస్‌బాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హాకీ, పారా స్పోర్ట్స్

మహబూబ్‌నగర్: నెట్‌బాల్, కబడ్డీ

మెదక్ : సాఫ్ట్‌బాల్

వరంగల్ : ఖోఖో

హనుమకొండ: అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్