calender_icon.png 4 March, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ - 2024 క్రీడా పోటీలను ప్రారంభించిన మంథని మున్సిపల్ చైర్ పర్సన్

11-12-2024 03:23:31 PM

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మంథని మున్సిపల్ స్థాయి కబడ్డీ, కో-కో, వాలీబాల్  పోటీలను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ లెవెల్ సీఎం కప్-2024 క్రీడ పోటీలను మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ... మంత్రి శ్రీధర్ బాబు సహకారం క్రీడాకారులకు ఎప్పుడు అండగా ఉంటూ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నారన్నారు. 

విద్యార్థులు గెలుపు ఓటములను సాధారణంగా భావించి గెలిచినవారు రాబోయే కాలంలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని భవిష్యత్తులో మన ప్రాంతానికి, మీ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అదేవిధంగా ఓడిపోయినవారు ఓటమిని గెలుపుకు తొలిమెట్టుగా భావించి నిరుత్సాహపడకుండా మరింత క్రీడా నైపుణ్యంతో రాణించాలని,   క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్స్ వి కె రవి, చొప్పకట్ల హనుమంతు,  గుండా పాపారావు, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ప్రభుత్వ హై స్కూల్ హెచ్ఎం సురేష్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.