calender_icon.png 11 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలు

11-12-2024 11:17:21 PM

అనంతగిరి: ప్రజాపాలన విజయ ఉత్సవాల భాగంగా అనంతగిరి మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలు అనంతగిరి మండలం శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల తహసిల్దార్ హిమబిందు హాజరై బుధవారం క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఆటల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడలతో క్రమశిక్షణ అలవాటు పడుతుందన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో ప్రతిభ చాటాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికే ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన వారు జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో కూడా గెలుపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుష్మ మండల విద్యాధికారి తల్లాడ శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయ, పిడీలు గోవిందరెడ్డి, శ్రీధర్, కోటయ్య, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.