calender_icon.png 12 December, 2024 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు

12-12-2024 01:26:22 AM

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్‌న పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 7వ తేదీన గ్రామస్థాయి క్రీడలు ప్రారంభమై 8న ముగిశాయి. అదే రోజు ప్రారంభమైన మండలస్థాయి పోటీలు కొనసాగుతున్నాయి.

పలుచోట్ల రాజకీయ ప్రము ఖులు, అధికారులు, కలెక్టర్లు హాజరై క్రీడాకారులను ఉత్సాహపరుస్తున్నారు. గురువారంతో మండల స్థాయి పోటీలు ముగియనుండగా.. 16 నుంచి జిల్లాస్థాయి క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో అధికారులు ఎల్‌బీ స్డేడియంలోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రధాన కార్యాలయంలో స్టేట్ మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.