calender_icon.png 14 January, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కప్ పోటీలు

11-12-2024 07:21:03 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం సీఎం కప్ క్రీడా పోటీలను రెండో రోజు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. పిల్లలకు పాటు వాలీబాల్, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, త్రో, కోకో, కబడి పోటీల నిర్వహించగా విజేతలను గురువారం ప్రకటించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.