calender_icon.png 5 March, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా సీఎం కప్ పోటీలు ప్రారంభం

11-12-2024 01:06:39 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల క్రీడా పాఠశాల మైదానంలో బుధవారం సీఎం కప్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడలను ఆర్డిఓ లోకేశ్వరరావు ప్రారంభించారు. ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్, యోగ, అథ్లెటిక్స్ క్రీడల్లో స్థాయి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 16న జరిగే జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ఎ సి ఎం ఓ పుర్క ఉద్ధవ్, గిరిజన శాఖ క్రీడల అధికారి బండ మీనారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ సుభాష్, పిడి మధుసూదన్ ప్రవీణ్, సాగర్, కోచ్ లు విద్యాసాగర్, తిరుమల్ ,అరవింద్, తదితరులు పాల్గొన్నారు.