దేవరకద్ర: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)ని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మరణించడంతో దశదిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హైద్రాబాద్ నుంచి నేరుగా మహబూబ్‌నగర్ జిల్లాలోని చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి చిత్రపటానికి రేవంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళి ఆర్పించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.