హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగనున్న హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా.. ఫ్రాన్స్ వెళ్లే ముందు గురువారం ఇషా సింగ్ కుటుంబ సభ్యులతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా ఇషాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ముఖ్యమంత్రి.. పారిస్‌లో పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.