ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలురు వద్ద కూరగాయలు అమ్ముకునే వారి పై లారీ దూసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబా లకు రూ.౫ లక్షల పరిహారం ప్రకటించారు.