calender_icon.png 21 January, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై స్పష్టత

16-07-2024 05:51:08 PM

హైదరాబాద్ : పంటల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వరిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.  2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలను మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని తెలిపింది.

దీంతో విపక్షల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో పంటల రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై స్పష్టత ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ జరుగుతుందని, కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన అని సీఎం తెలిపారు. కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

ఈ నెల 18వ తేదీన రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తామని, గురువారం సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆయన చెప్పారు. జూలై 18న రైతు వేదికలో రుణమాఫీ లబ్ధిదారుల సంబురాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నాలని సీఎం ఆదేశించారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకర్లు రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.