మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): జార్ఖండ్, మహారాష్ర్ట ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో నాయకత్వ మార్పిడి తథ్యమని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా.ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తన పదవిని కాపాడుకునేందుకు రేవంత్ నానా అవస్థలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. సోనియా దేవత అంటూ.. రాహులే దేశానికి సర్వస్వమంటూ భజన చేస్తున్నారన్నారు. ఒకరోజు గడిస్తే చాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రేవంత్ తన పదవిని కాపాడుకునే పనిలో పడి పాలనను గాలికొదిలేశారని విమర్శించారు.