calender_icon.png 25 December, 2024 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు హర్యానాకు ఏపీ సీఎం

16-10-2024 03:04:21 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు హర్యానాకు పయనం కానున్నారు. హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణం చేయనున్నారు. నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి 11 గంటలకు చంద్రబాబు చండీగఢ్ కు చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 12 నుంచి 2 మధ్య పంచకులలో సీఎం చంద్రబాబు ఉండనున్నారు.  మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7వరకు చండీగఢ్ లో ఎన్డీయే పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం రాత్రి 10 గంటలకు విజయవాడకు చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు.