calender_icon.png 31 January, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవీ మాత ఆలయాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు

31-01-2025 04:28:15 PM

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆరాధ్యదైవం శ్రీ వాసవీ మాత(Vasavi Matha temple) ఆత్మబలిదానా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పెనుగొండను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, వాసవీ మాతను ఆరాధించడం వల్ల శాంతి, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని ఉద్ఘాటించారు.

ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఆర్య వైశ్య సమాజం సమగ్ర అభివృద్ధికి తన ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. “స్వర్ణ ఆంధ్ర విజన్ 2047”(Swarna Andhra Vision 2047)తో సంకీర్ణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఈ దార్శనికతను సాకారం చేయడంలో ఆర్య వైశ్య సంఘం కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవీ మాత(Vasavi Matha). స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి వాసవీమాత. అహింస, ఆత్మత్యాగానికి, శాంతికి ప్రతిరూపం వాసవీమాత. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. సమాజం పట్ల అత్యంత బాధ్యతగల వ్యక్తులు ఆర్యవైశ్యులన్న చంద్రబాబు  ఆర్యవైశ్యులు నీతి నిజాయితీతో కష్టపడి పని చేస్తారని కొనియాడారు. సంపాదించిన దాంట్లో ప్రజాసేవకు కొంత ఖర్చు చేస్తారని చెప్పారు. కార్పొరేషన్ ద్వారా ఆర్యవైశ్యుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.