అమరావతి: తిరుపతిలోని తొక్కిసలాట ఘటన స్థలానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(AP CM Chandrababu) చేరుకున్నారు. కలెక్టర్, టీటీడీ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చకోండని సూచించారు. నిన్నటి ఘటన గురించి టీటీడీ(TTD) అధికారులు సీఎంకు వివరించారు. ముఖ్యమంత్రి జిల్లా అధికారులను అడిగి వివరాలు తెలుకున్నారు. టీటీడీ అధికారుల ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలించారు. అంబులెన్స్ ల లభ్యత గురించి ఆరా తీస్తున్నారు.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను సూచించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. గతంలో లాగే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు(TTD EO Shyamala Rao) సీఎంకు వివరించారు. ఎవరో చేశాడని నువ్వు అలానే చేస్తావా నీకంటూ కొత్త ఆలోచనలు లేవా?, టెక్నాలజీని ఎందుకు వాడుకోలేని ఈవోను చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు.