calender_icon.png 5 February, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాన్వాయ్ డ్రైవర్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

05-02-2025 03:58:43 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) కాన్వాయ్‌లోని డ్రైవర్ ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మృతి చెందారు. అమీన్‌బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమీన్ బాబు చాలా కాలంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అమీన్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ప్రభుత్వం వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు.