calender_icon.png 26 December, 2024 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడంగల్ లో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

08-11-2024 12:59:16 PM

సీఎం జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి

కొడంగల్ (విజయాక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో మునిసిపల్ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మునిసిపల్ పారిశ్యుద్య కార్మికులు, కార్యాలయ సిబ్బందితో కలిసి కేకు కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ కొడంగల్ మునిసిపల్ కమీషనర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగృహంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కటే చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.