calender_icon.png 27 December, 2024 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అతిశీని అరెస్ట్ చేస్తారు

26-12-2024 03:38:39 AM

  1. మీడియా సమావేశంలో కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
  2. అరెస్టు కోసం దర్యాప్తు సంస్థలను బీజేపీ ఆదేశించిందని ఆరోపణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: తప్పుడు కేసు లో సీఎం అతిశీని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయాంటూ మీడియా సమావేశంలో ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవా ల్ బుధవారం సం చలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీబీఐ, ఈడీ అధికారుల సమావేశం జరిగిందని, ఆ సందర్భంగా సీఎంను తప్పు డు కేసులో ఆరెస్ట్ చేయాలని దర్యాస్తు సంస్థలను బీజేపీ ఆదేశించిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి తమ దృ ష్టిని మరల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు.ట్రా

న్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఓ తప్పుడు కేసులో అతిశీని ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహిళల కోసం ప్రవేశ పెట్టిన ఉచిత బస్ పథకాన్ని నిలిపివేయాలని బీజేపీ కోరుకుంటుందన్నారు. తాను బతికున్నంత వరకూ అది ఎట్టి పరిస్థితుల్లో జరగద న్నారు. అతిశీ అరెస్ట్‌కు ఆప్‌నకు సంబంధించిన నేతల్లో ఇళ్లపై సోదాలు నిర్వహించేందు కు కుట్ర జరుగుతుందన్నారు. అనంతరం  సీఎం అతిశీ మాట్లాడుతూ తనపై కేసు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందనడానికి తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఒక వేళ తనను అరెస్ట్ చేసినా న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై తనకు నమ్మకం ఉందన్నారు. 

ఆప్ హామీలకు విరుద్ధంగా పత్రికల్లో ప్రకటన

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ‘మహి ళా సమ్మాన్ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తామని ఆప్ ప్రకటించింది. సంజీవని యోజన కింద సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే వీటికి విరుద్ధంగా అక్కడి ప్రజలను హెచ్చరిస్తూ ఢిల్లీ పత్రికల్లో ప్రకటనలు వచ్చా యి. అందులో ‘మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేయలేదు.

సంజీవని పథకాన్ని కూడా ప్రారంభించలేదు. వృద్ధుల వ్యక్తిగత సమాచారాన్ని సేక రించే అధికారం ఎవ్వరికీ లేదు’ అంటూ మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య శాఖలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే పత్రికల్లో ప్రకటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఎన్నికల హామీలతో ఆప్ రాజకీయ మోసానికి పాల్పడిదని ఆరోపించింది.