న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. కాల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి(BJP Candidate Ramesh Bidhuri)పై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి వెనుకంజలోనే ఉన్న ఆతిశీ సింగ్ చివరి రౌండ్లలో పుంజకొని విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆతిశీ సింగ్ మాట్లాడుతూ... తనన్ను గెలిపించిన కాల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అతిశీ బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై గెలుపొందింది.
కల్కాజీ నియోజకవర్గం ఎన్నికల ఫలితం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి పూర్తి ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి అతిశీ ఓటమి ఖాయం అనుకున్నారు. కానీ, చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకుని రమేశ్ బిధూరిపై ఘన విజయం సాధించారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ఆప్ అగ్రనేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన బీజేపీ దేశ రాజధానిలో విజయఢంకా మోగించింది.