calender_icon.png 25 October, 2024 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్కు బెయిల్

12-07-2024 11:17:23 AM

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టులో పలు అంశాలు, సెక్షన్లను పరిశీలించాల్సిన ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు. అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మద్యం విధానం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేజ్రీవాల్ సవాల్ చేశారు. కేజ్రీవాల్, ఈడీ వాదనల అనంతరం మే 17న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. జూన్ 20న కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. సాధరణ బెయిల్ పై మరుసటి రోజు ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఆదేశాలపై గత నెల 25న ఢిల్లీ హైకోర్టులో స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. గతనెల 27న కేజ్రీవాల్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది దర్యాప్తు సంస్థ. అయితే జూన్ 25న అదే మద్యం పాలసీ కేసుకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి కేజ్రీవాల్ కస్టడీలోనే ఉన్నారు.