calender_icon.png 16 January, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం, మంత్రులే పన్ను చెల్లించాలి

06-07-2024 01:31:30 AM

  1. వారి జీతభత్యాలపై పన్నును ప్రభుత్వం ఎందుకు కట్టాలి?
  2. 2015లో తెచ్చిన జీవో917ను రద్దు చేయాలి
  3. హైకోర్టులో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తీసుకొనే వేతనాలపై చెల్లించాల్సిన పన్నును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధానాన్ని రద్దు చేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వీరి వేతనాలపై ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాస్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. వేతనాలు, పెన్షన్, అనర్హతపై తొలగింపు చట్టం 1953 లోని సెక్షన్ 3(4) ప్రకారం ఈ విధమైన వెసులుబాటు ఉండటం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కోరారు.

ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రజల మాదిరి గానే సీఎం, మంత్రులను కూడా పరిగణించాని విజ్ఞప్తి చేశారు. ‘వీరి జీత భత్యాలపై ప్రభుత్వమే పన్ను చెల్లించేలా 2015లో జీవో 917 తెచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలి. వాళ్లంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ పలు సవరణలు తేవడంతో వారితోపాటు క్యాబినెట్ ర్యాంకు ఉన్న సలహాదారులు, చైర్మన్లు, పార్లమెంట్ కార్యదర్శులు, ఇతరులకు ప్రభుత్వమే పన్ను చెల్లించేలా తెచ్చి న జీవో చట్ట వ్యతిరేకమని తీర్పు చెప్పాలి. ఏ మేరకు పన్నులు చెల్లించిందీ వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద కోరితే ఇవ్వ లేదు.

వ్యక్తిగత గోప్యత పేరుతో వివరాలు ఇవ్వలేదు. ఆ వివరాలు ఇస్తే వ్యక్తిగత గోప్యతకు భం గం ఎలా అవుతుంది? ప్రజలు పన్నుల రూపం లో చెల్లించిన డబ్బును నుంచి వాళ్ల ఆదాయాలకు పన్ను కట్టడం దారుణం. ఆదాయపు ప న్ను వివరాలను వెల్లడించడంలో గోప్యత అవసరమే లేదు. గత 10 ఏండ్లుగా కోట్ల రూపా యలు ప్రభుత్వం పన్ను రూపంలో చెల్లించింది. ఇది వివక్ష కిందకే వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వేతనాలు, రాబడి ఉన్న వాళ్లం తా పన్ను చెల్లించాల్సిందే. ఆ జీవోను రద్దు చేయాలి’ అని పిటిషనర్ విన్నవించారు. పిల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిని ప్రతివాదులు గా చేర్చారు. ఈ పిల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించనున్నది.