హైదరాబాద్: బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం పేర్కొన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తనకు మిత్రుడు, సన్నిహితుడు అన్న సీఎం యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రపోషించి తన కంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని కోనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. జిట్టా బాలకృష్ణారెడ్డి మృతిపట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబానికి భట్టి విక్రమార్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం బాధాకరం అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.