03-04-2025 07:30:45 PM
హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్నం నుంచి జోరు వాన కురుస్తోంది. నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని, రోడ్లపై నీరు నిలవకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించాలని, అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్యను త్వరగా క్లియర్ చేయాలన్నారు. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.